మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ….!!

ప్రస్తుత రోజుల్లో మధుమేహం వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవనశైలి, ఆరోగ్యపు అలవాట్లు. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా… తింటే ఏమవుతుందనే సందేహాలు మనలో చాలామందికి ఉంటాయి.

దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తినవచ్చని, అలా అని ఏది పడితే అది తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి బెల్లం దొరకడం చాలా కష్టమని చెప్పవచ్చు.

విటమిన్లు, మినరల్స్, ఖనిజాల సమతుల్యత ఉన్న ఆహారాన్ని ఎవరు తీసుకోవడం లేదని, ఇది కూడా షుగర్ రావడానికి ఒక ప్రధాన కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరు ఇష్టమెచ్చిన సమయానికి వారు నిద్రపోయిన ఇష్టంమెచ్చిన సమయానికి లేస్తున్నారు. మధుమేహ వ్యాధి రావడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది.