విజయ్ దేవరకొండ “ఖుషి” ఇంత పెద్ద హిట్ అవ్వడానికి అస్సలు కారణం ఇదే.. తెర వెనుక మ్యాటర్ నడిపించింది ఆయనే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎటువంటి సపోర్ట్ లేకుండా పైకి ఎదుగుతున్నారు అంటే తొక్కేయడానికి కాళ్లు పట్టుకొని లాగడానికి ఎప్పుడు నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో అయితే మరీ ఎక్కువగా అలాంటి జనాలు ఉన్నారు అంటూ కామన్ పీపుల్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాగా మరీ ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఎప్పుడు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అస్సలు సపోర్ట్ చేయరని ఆయనను తొక్కేయడానికి చూస్తూ ఉంటారు అని ఇప్పటికే మనం ఎన్నో కామెంట్స్ విన్నాం .

కాగా రీసెంట్గా ఖుషి సినిమా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే టాలీవుడ్ నుంచి ప్రతి సినిమాకి రివ్యూ ఇచ్చే స్టార్ హీరోలు ఈయన సినిమాకు మాత్రం ఎటువంటి రివ్యూ ఇవ్వలేదు ..కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు . దీంతో సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఆ హీరోస్ ని ఏకిపారేస్తున్నారు . అయితే మరి కొంతమంది జనాలు వాటికి రివర్స్ కౌంటర్ గా ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.. విజయ్ నే టార్గెట్ చేస్తున్నారు .

ప్రతి సినిమాకి అతి ఓవర్ చేసే విజయ్ దేవరకొండ ఈ సినిమాకి గప్ చుప్ గా ఉన్నాడని ..ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజిపై షర్ట్ తీసేసాడు తప్పిస్తే ..ప్రమోషన్స్ లో ఎక్కడ హద్దులు మీరి మాట్లాడలేదని ..ఆయన ఆటిట్యూడ్ చూపించలేదని ..ఆ కారణంగానే ఈ సినిమా హిట్ అయింది తప్పిస్తే సినిమాలో పెద్ద మ్యాటర్ లేదని రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు . అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి విజయ్ దేవరకొండ సమంత కంటే ముఖ్య కారణం డైరెక్టర్ శివ నిర్వాణ అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!