బేబీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది వైష్ణవి చైతన్య. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ లెవెల్లో సక్సెస్ సాధించింది. ఊహించిన రేంజ్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీతో వైష్ణవి చైతన్య క్రేజ్ ఓ రెంజ్ లో పెరిగిపోయింది.
రొమాంటిక్ పర్ఫామెన్స్ తో కుర్రకారులు ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ తరంలో ఆడపిల్లలు అత్యాశతో ఎటువంటి తప్పులు చేస్తున్నారో అనే అంశంపై తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలి అనే అంశంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు ఇలాంటి భర్త రావాలి అలాంటి భర్త రావాలి అని పెద్దగా ఆశలు ఏమి పెట్టుకోవడం లేదు.
ఆస్తిపాస్తులు లేకున్నా, హ్యాండ్సమ్గా లేకపోయినా నాకు పర్వాలేదు.. కానీ నన్ను మాత్రం బాగా చూసుకోవాలి ఉన్నదాంట్లో ఇద్దరం సంతోషంగా ఉండాలి.. డబ్బులు లేకపోయినా నన్ను కేర్గింగా చూసుకోవడం ముఖ్యం అంటూ వైష్ణవి తనకు కాబోయే భర్తలో ఉండే క్వాలిటీస్ గురించి వివరించింది. దీంతో కుర్రాళ్ళు ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి నన్ను పెళ్లి చేసుకో బేబీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.