విజయ్ దేవరకొండ అందుకే పనికి వస్తాడా..? ఆ విషయంలో బిస్కెట్ నా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం చూస్తూనే ఉన్నాం . పెళ్లి చూపులు సినిమాతో కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత పలు డిఫికల్ట్ కాన్సెప్ట్ సినిమాలను టచ్ చేశారు . అయితే ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . మళ్ళీ అర్జున్ రెడ్డి అంటూ ఓ మంచి లవ్ రొమాంటిక్ సినిమాతో తెర పైకి వచ్చాడు. ఈ సినిమా ఆయన తలరాతనే మార్చేసింది .

ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే .. అందరు విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి గానే గుర్తిస్తున్నారు .. సంబోధిస్తున్నారు . అయితే విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి క్రేజీ హిట్ అందుకునిందే లేదు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన ఖాతాలో ఎన్నో సినిమాలను వేసుకున్నాడు. విజయ్ దేవరకొండ తన కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించాడు కానీ విజయ్ దేవరకొండ అందుకున్న హిట్స్ అన్నీ కూడా లవ్ రొమాంటిక్ సినిమాలే కావడం గమనార్హం.

అంతేకాదు భారీ యాక్షన్ సీన్స్ మధ్య తెరకెక్కిన అన్ని సినిమాలు డిజాస్టర్ అయాయి. దీంతో విజయ్ దేవరకొండ కి లవ్ రొమాంటిక్ సినిమాలు మాత్రమే సెట్ అవుతాయి అని.. మిగతా కాన్సెప్ట్ సినిమాల విషయంలో ఆయన డమ్మి అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు రీసెంట్గా ఆయన నటించిన ఖుషి సినిమా సైతం అదే కన్ఫామ్ చేస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు . అయితే విజయ్ దేవరకొండ కి రొమాంటిక్ లవ్ సినిమాలు తప్పిస్తే మరి ఏ సినిమాలు సూట్ అవ్వవు అని..ఆయన అందుకే పనికొస్తాడని కావాలనే కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!