ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో వ‌రుణ్‌తేజ్ కొత్త సినిమా… అప్పుడే రిలీజ్ డేట్ కూడా…!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో రూపొందుతున్న ప్రాజెక్ట్ గాండీవధారి అర్జున్ ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత వరుణ్ హీరోగా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ రాబోతున్న మరో సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు ఆపరేషన్ వాలంటైన్ అనే అధికారిక టైటిల్ ని ఖరారు చేశారు మూవీ టీం.

ఈ సినిమా డిసెంబర్ 8, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీం ఒకసారి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్‌ కీరోల్‌ ప్లే చేస్తున్న ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ మరియు విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ అయినా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్గా కనిపిస్తుంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్క‌బోతుంది. భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌ఫోర్స్ యాక్ష‌న్‌ మూవీగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైస‌న్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.