ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులు ఇరగదీసిన బామ్మ..?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు పాటలకు ఇప్పటికే భారీగా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది. చాలా మంది నెటిజన్లు ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ చెప్పులు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే నాటు నాటు అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఒక బామ్మ. ఈ వయసులో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బామ్మ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అంతే కాకుండా ఈ భామ డాన్స్ ను అభినందిస్తూ త్రిబుల్ ఆర్ చిత్ర బృందం ఈ వీడియో ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బామ్మగారు అంటూ పంచుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ గారు మీ ఉత్సాహానికి హ్యాట్సాఫ్.. మీ డాన్స్ కెవ్వు కేక అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.