సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫెరర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డామినిక్ అరుణ్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్రీన్ కే, గాఫూర్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా.. మలయాళ మూవీ అయిన తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం సృష్టిస్తుంది. మన తెలుగులో సీతారా ఎంటర్టైన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ అశ్విన్, వెంకీ అట్లూరి సైతం స్పెషల్ గా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే ఈవెంట్‌లో వెంకి అట్లూరి మాట్లాడుతూ సినిమా నేను చూశా.. నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బ్రిలియంట్ సినిమా. రూ.30 కోట్లతో.. రూ.300 కోట్ల రేంజ్ సినిమాను తీశారని.. అందరు చెబుతున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినా మలయాళ సినిమాల పరంగా రూ.30 కోట్లనేది చాలా ఎక్కువ. ఈ సినిమాని నమ్మి ప్రొడ్యూసర్ గా దుల్కర్ సల్మాన్ చేసిన ధైర్యంకు ముందుగా అభినందించాలి. అలాగే.. సినిమాటోగ్రాఫర్‌గా నిర్మిష్ రవి, డైరెక్టర్ డామినిక్‌లను విష్ చేయాల్సిందే. మలియాళ పరిశ్రమంలో అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాల్లో ప్రతి ఒక్కరు అద్భుతమైన నటన కనపరిచారు. కళ్యాణి ప్రియదర్శన్ మరింత మెప్పిస్తుంది. తాను నాకు తెలుసని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందంటూ వెంకీ అట్లూరి వివరించాడు.
యాక్షన్స్ సన్నివేశాలు తను చేసిన తీరుకు హ్యాట్సాఫ్. రచన అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేశాడు. ఈ సినిమా ఇంత గొప్పగా మలిచినా డైరెక్టర్ డామినిక్ అరుణ్ ఈ ప్రశంసలన్నింటికీ అర్హుడని చెప్పుకొచ్చాడు. ఇక నాగ వంశీ గురించి మాట్లాడుతూ.. ఆయన ఆగస్టులో ఓ సినిమా వల్ల మాటపడ్డాడు. అదే నేల చివర్లో ఈ హిట్ సినిమాతో స్ట్రాంగ్ సమాధానం ఇచ్చాడు.. దట్ ఇజ్ నాగవంశీ అంటూ వివరించాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి.. నాగవంశీపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.