మా వందే: నరేంద్ర మోడీ బయోపిక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?

ప్రస్తుతం ఇండియన్స్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతుంది. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు, క్రీడారంగంలోని స్టార్స్ గా రాణించిన వారు.. అలాగే సింగర్స్‌, నటినటులు, రాజకీయ నేతల బయోపిక్స్‌ సైతం వెండితెరపై రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బాస్టర్లుగా నిల‌వ‌గా.. మరికొన్ని ఫ్లాప్స్ గా మారాయి. ఇంకొన్ని బయోపిక్ లు ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి.

Biopic On Prime Minister Narendra Modi Announced: 'Maa Vande' – Unni  Mukundan To Portray Lead Role.🎬 On the occasion of Hon'ble Prime Minister # NarendraModi ji's birthday, #SilverCastCreations has announced a biopic  titled #

ఇలాంటి క్రమంలో ప్రజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మోడీ బయోపిక్‌లో.. భారీ టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్లో మూవీ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో నరేంద్ర మోడీ లైఫ్ జర్నీకి సంబంధించిన బయోపిక్ పీఎం నరేంద్ర మోడీ టైటిల్ తో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్.. ఈ మూవీలో మోడీ పాత్రలో నటించగా.. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ బయోపిక్ ను మరోసారి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు.

Unni Mukundan to play PM Narendra Modi in biopic 'Maa Vande' | Onmanorama

ఇక ఈ సినిమాల ప్రధాన మోడీ పాత్రలో ఉన్ని ముకుందన్‌ నటించనున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్, భాగమతి, యశోద లాంటి తెలుగు సూపర్ హిట్ సినిమాలు నటించి ఆకట్టుకున్న ఉన్ని ముకుందన్‌.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బయోపిక్ లో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో క్రాంతి కుమార్ సి.హెచ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి డిఓపి కేకే సెంథిల్.. కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ‌సృర్‌ సినిమాకు పని చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను నేడు మోడి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా అఫీషియల్‌గా ప్రకటించారు టీం.