టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ. రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. ఇక సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ప్రపంచంలోని సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పవన్ అభిమానుల సందడి మొదలైపోయింది. ప్రస్తుతం ఓజీ ఫీవర్ తెలుగు రాష్ట్రాలను దాటి.. నార్త్ అమెరికాలోనూ సోకింది. రిలీజ్ కి ముందే ఇక్కడ రికార్డు లెవెల్లో టికెట్లు అమ్ముడుపోతున్నాయని.. మూవీ యూనిట్ అఫీషియల్ గా వెల్లడించారు.
టికెట్స్ హాట్ కేకుల అమ్ముడుపోయాయని.. ఇంకా ప్రీమియర్స్ కు చాలా సమయం మిగిలే ఉన్నా రికార్డ్ లెవెల్ లో సెల్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక ఈ స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కోసం.. అభిమానులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సినిమాపై ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అంచనాలను మరింతగా పెంచేసాయి. ఇక సినిమాల్లో పవన్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా మెరవనుంగడా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో టాలీవుడ్ డబ్యూ ఇవ్వనున్నాడు.
ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్ ఇలా స్టార్ కాస్టింగ్ అంతా కీలక పాత్రలో మెరుస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ధమన్ వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే నార్త్ అమెరికా ఫ్రీ సేల్స్ బుకింగ్స్ లో దాదాపు 45 వేలకు పైగా టికెట్లు సేల్ చేసి రికార్డు క్రియేట్ చేసిందని మూవీ యూనిట్ వెల్లడించారు. అద్భుతమైన ఘనత నార్త్ అమెరికాలో ఈ ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా ఓజీ ఖాతాలో పడిందని.. ఇప్పటికే ఓజి 1$ మిలియన్ గ్రాస్ దాటేసింది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక పవనిజం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోను ఏ రేంజ్ లో ఉందో మరోసారి రుజువైంది.