లైఫ్ లో ఏది పర్మినెంట్ కాదు.. అర్థం చేసుకుంటే మనకే మంచిది.. సమంత

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దమున్నర పాటు ఇండస్ట్రీని ఏలేసిన ఈ అమ్మడు.. కేవలం తెలుగే కాదు.. తమిళ్ భాషలోను తిరుగులేని ఇమేజ్లు క్రియేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం ఉన్న సౌత్ స్టార్ హీరోయిన్ల అందరిలో సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకునే లిస్టులో మొదటి సమంత పేరే వినిపిస్తుంది. ఇక సమంత గత కొంతకాలంగా మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇది ఆమె కెరీర్ కు బాగా ఎఫెక్ట్ అయిందనడంలో అతిశ‌యోక్తి లేదు. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా హీరోయిన్‌గా ఫుల్ బిజీ కావట్లేదు సమంత.

చాలా రేర్‌గా సినిమాలను ఎంచుకుంటూ నటిస్తోంది. ఇక ఇటీవల నిర్మాతగాను మారి.. శుభం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాలో గెస్ట్ రెల్ లోను మెరిసింది. ఈ సినిమాతో మంచి నేమ్‌ వచ్చిన తర్వాత కూడా.. నెక్స్ట్‌ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు. కాగా.. ఇలాంటి క్రమంలో ఈ అమ్మ‌డు మళ్ళీ తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వైరల్‌గా మారుతుంది. అయితే.. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవ‌ల అమ్మడికి సంభందించిన ఏదో ఒక వార్తలతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

( Photos : Instagram )

అలా.. తాజాగా తన ఇబ్బందుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చేసిన కంప్లైంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ.. లైఫ్‌లో సినిమాలపరంగా, కెరీర్, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏది పర్మినెంట్ కాదని అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఏదైనా చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుందని.. ఒక నటిగా ఎదగడానికి అదృష్టానికి మించి ఇంకా చాలా కావాలంటూ వివరించింది. తను తన లైఫ్‌లో నటిగా కంటే.. మరింత ప్రభావాన్ని చూపించాలని భావిస్తున్నానంటూ వివరించింది. దాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిద‌ని చెప్పుకొచ్చింది. ఇక సమంత చేసిన కామెంట్స్ నిటింట‌ వైరల్‌గా మారడంతో.. దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజ‌న్స్‌.