యంగ్ నటుడు మౌళి లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే.. డబల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటే.. ఆడియన్స్‌కు ఏ రేంజ్ లో కంటెంట్ కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ఇండస్ట్రీకి మరో నేచురల్ హీరో వచ్చాడంటూ కామెంట్లు సైతం వినిపించాయి. మౌళి నటనకు ఆడియన్స్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక లిటిల్ హార్ట్స్ సినిమాతో మౌళి రేంజ్ డబుల్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఈ సినిమా కంటే ముందు మళ్ళీ మౌళి ఓ స్టాండ్ అప్ కమెడియన్‌గా వ్యవహరించేవాడట.
ఎన్నో వందల ఈవెంట్స్‌లో.. స్టాండప్ కామెడీ చేస్తూ సంపాదనను కూడా పెట్టేవాడు. అలా పాపులర్ అయిన మౌళి.. తన యూట్యూబ్ ఛానల్ మౌళి టాక్స్ ద్వారా.. మరింత ఇమేజ్ ని దక్కించుకున్నాడు. తన అద్బుతమైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అలా వచ్చిన పాపులారిటీతోనే 90స్ కిడ్స్ వెబ్ సిరీస్ లో ఛాన్స్ కొట్టేశాడు. ఇక ఇది సక్సెస్ కావడంతో.. ఈటీవీ వినే స్వయంగా ప్రొడక్షన్ లోకి దిగి లిటిల్ హార్ట్స్ సినిమాను చేశారు.
ఈ సినిమాతో మౌళి కొట్టిన బ్లాక్ బస్టర్ దెబ్బకు ఇప్పట్లో మౌళి మళ్లీ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ సినిమా కంటే ముందు మౌళి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా భారీగానే సంపాదించేవాడు అంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. అప్పటికే మౌళి యూట్యూబ్ ఛానల్ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయన నెలకు దాదాపు పది లక్షల వరకు సంపాదించేవాడట. ఇప్పుడు హీరోగా మారిన తర్వాత కూడా.. అదే రేంజ్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాఆడు. ఇక ఫ్యూచర్లో తన టాలెంట్ తో కోట్లు కూడపెడతాడు అంటూ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.