కొత్తలోక : ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో ఇమేజ్ చాలా గర్వంగా ఉంది.. కళ్యాణి ప్రియదర్శి

స్టార్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లోక చాప్టర్ 1 చంద్ర. కొత్తలోక పేరుతో టాలీవుడ్ లోను ఈ సినిమా డబ్ అయిన సంగతి తెలిసిందే. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. కొద్దిరోజుల క్రితం గ్రాండ్గా రిలీజై విమర్శకులతోను ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శికి మంచి ఇమేజ్ సంపాదించి పెట్టింది. ఈ క్రమంలోనే కళ్యాణి దీనిపై రియాక్ట్ అవుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్టమొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ వివరించింది.

Did you know? Hrithik Roshan played a part in 'Lokah Chapter 1' star Kalyani  Priyadarshan's film journey | Mint

ఇక సినిమా సక్సెస్ తర్వాత అందరూ నన్ను ఫిమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నారని.. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటూ వివరించింది. ఈ సినిమా సక్సెస్ సాధించడానికి నాతోపాటు.. మా టీమ్ అంత ఎంతగానో కష్టపడ్డారు.. ఈ సక్సెస్ క్రెడిట్ వాళ్లకు కూడా చెందుతుందంటూ చెప్పుకొచ్చింది. నేను సినిమాకు సైన్ చేసేటప్పుడు ఎంత సక్సెస్ సాధిస్తామని ఊహించలేదు. మంచి కథలో భాగం కావాలని మాత్రమే అనుకున్న. షూట్ చేసే టైంలో ఇది కచ్చితంగా సక్సెస్ కొడుతుందని అర్థమైంది. ఈ సినిమా మొత్తాన్ని నేనే భుజాలపై వేసుకొని మోసానంటూ ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు.

Loka's Box Office Success: Records Broken | 200 കോടി ക്ലബ്ബില്‍ 'ലോക';  മോഹന്‍ലാല്‍ ചിത്രങ്ങള്‍ വീഴുമോ?

కానీ.. మా టీంలో పురుషులు, మహిళలు అని తేడా లేదు ప్రతి ఒకరి కష్టం సినిమాలో ఉంది. లోకా చాప్టర్ 1 చంద్ర మొట్టమొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమా కావడం వల్ల దీన్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు.. హీరోయిన్స్ కూడా ఎలాంటి పాత్రలోనైనా చేసి సక్సెస్ అందుకోగలరని అందరికీ దీంతో నమ్మకం కలిగింది అంటూ కళ్యాణి ప్రియదర్శన్‌ వివరించింది. డామినిక్ అరుణ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆగస్టు 29 గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక తాజాగా రూ.200 కోట్ల కలెక్షన్ల రికార్డును కొత్తలోక బ్రేక్ చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. దేశవ్యాప్తంగా హైయెస్ట్ వసూలు సాధించిన నాలుగో మలయాళ సినిమాగా ఇది నిలిచింది.