సౌత్ ఇండియాలో టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లోనే దొరల రేట్లు!

సినిమా టికెట్ల ధరలపై దక్షిణాదిన ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదని జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతంగా ప్రేక్షకుల హర్షాన్ని పొందుతుండగా, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మాత్రం షాక్ లో ఉన్నారు ..Theater strike postponed: Summer movies breathe a sigh of relief

బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇప్పటివరకు ఫ్లెక్సీ ప్రైసింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. క్రేజీ సినిమాలకు టికెట్ల రేట్లు ₹800 నుంచి ₹1000 దాకా వెళ్లేవి. ఇప్పుడు ఆ ఎక్స్‌ట్రా రేట్లకు చెక్ పడేలా ఈ కొత్త జీవో రూపొందించారు. టికెట్ ధరలు తగ్గితే థియేటర్ ఫుట్‌ఫాల్స్ పెరుగుతాయని, దీని వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కాకుండా లాభమే ఉంటుందని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ: మల్టీప్లెక్స్ టికెట్ ధర ₹295 దాకా ఉంటుంది. సింగిల్ స్క్రీన్ ధర ₹150 – ₹175 మధ్యలో. ఆంధ్రప్రదేశ్: మల్టీప్లెక్స్ ధర ₹180, సింగిల్ స్క్రీన్లలో ₹112 – ₹150. తొలి వారానికి అదనపు ఛార్జ్‌లుగా ₹50–₹100 వరకూ పెంచే అవకాశం ఉంది. తమిళనాడు: మల్టీప్లెక్స్ టికెట్ ధర కేవలం ₹190. అదనపు ఛార్జీలు అనుమతించరు. సింగిల్ స్క్రీన్ ధర ₹110–₹150. కేరళ: మల్టీప్లెక్స్ ధర ₹180. సింగిల్ స్క్రీన్ ధర ₹130–₹150.
కర్ణాటక: కొత్త జీవో ప్రకారం మల్టీప్లెక్స్ టికెట్ ధర గరిష్ఠంగా ₹200. సింగిల్ స్క్రీన్ ధర ₹110 – ₹150 మధ్యలో ఉంటుందనుంది.Vintage Indian Movie Theatres

ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక టికెట్ ధరలు ఉన్నాయి. ఇది ప్రేక్షకులపై బారీ భారం వేసే అంశంగా మారింది. ఈ ధరల కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యలోనూ గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. ఇప్పుడు కర్ణాటక తీసుకున్న నిర్ణయం దక్షిణాదిన కొత్త దారిని చూపిస్తుందా? లేక మరిన్ని వివాదాలకు తెరలేపుతుందా? అన్నదే ఆసక్తికర అంశం.