బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే పలు కాంట్రవర్సీలతో సతమతమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలను విపరీతమైన ట్రోల్స్ ని ఎదుర్కొన్న సల్మాన్.. వార్తల్లో తెగ వైరల్ గా మారాడు. తాజాగా మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో.. సల్మాన్ ఖాన్ పై విరుచుకుపడుతున్నారు జనం. అతనిపై మండిపడుతూ బండ బూతులు తిడుతున్నారు. తాజాగా.. మరోసారి సల్మాన్ తన వక్రబుద్దిని బయట పెట్టాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. పాక్ – భారత్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల పోటాపోటీ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా స్పందించిన సల్మాన్ ఖాన్.. రెండు దేశాల మధ్య సీజ్ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు.
దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఫ్యాన్స్ నుంచి ఇటు బిజెపి నేతల నుంచి ఆయనపై విమర్శలు కురుస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ వెంటనే ఆ పో స్ట్‌ను డిలీట్ చేసేసాడు. అయితే.. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై ఎన్ని రోజులు అయినా.. ఇప్పటివరకు స్పందించని సల్మాన్.. ఇన్ని రోజుల తర్వాత విరమణపై స్పందించడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్ని రోజులు నోరు మెదపని సల్మాన్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ.. పాకిస్తాన్ పై సల్మాన్ ప్రేమ బయటపడింది.. పాక్‌కు సపోర్ట్ గా ఉండే ఇలాంటి వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో సల్లు భాయ్ వెంటనే వీటిని డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతుంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బిజెపి నేత మాధవి లత సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు కురిపించింది.
తీవ్రవాదులు భారత్ లోనే ఉన్నారని.. ముందు వాళ్ళని దేశం నుంచి తరిమేయాలంటూ మండిపడింది. అయితే కొంతమంది మాత్రం సల్మాన్ కు సపోర్ట్‌గా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ తప్పులేదు.. సీజ్ఫైర్ ఒప్పందానికి దేవుడికి ధన్యవాదాలు చెప్పడంలో తప్పేముంది.. పాకిస్తాన్ ఈ సీజ్ఫైర్ ను ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఆ ట్విట్ సల్మాన్ డిలీట్ చేశాడని.. ఆయన తప్పు ఉంది కాబట్టి డిలీట్ చేయలేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పాహల్గం ఉగ్రదాడిపై కూడా సల్మాన్ ట్విట్ షేర్ చేసుకున్నాడు. భూతల స్వర్గం కాశ్మీర్.. నరకంగా మారుతోందని.. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. వాళ్ల కుటుంబాల గురించి నా హృదయం ఆలోచిస్తోంది.. ఒక అమాయకుడిని చంపడం అంటే ఓ ప్రపంచాన్నే చంపడంతో సమానం అంటూ సల్మాన్ ఆ పోస్టులో పంచుకున్నారు.