ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినిమాకు ప్రొడ్యూస్ చేసి.. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటేనే చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి క్రమంలో కూడా అతి తక్కువ బడ్జెట్ తో తతెరకెక్కి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సస్‌తో నిర్మాతలకు 2024 లాభాల సంవత్సరంగా మారిపోయింది. ఇంతకీ నిర్మాతలను లాభాల్లో ముంచేసిన ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సౌత్ సినిమాల హవా బాలీవుడ్లో విపరీతంగా కొనసాగడంతో బాలీవుడ్ సినిమాలకు చాలా లాస్ వచ్చింది.
ఇలాంటి క్రమంలో నార్త్‌లో స్త్రీ2 రిలీజై.. మంచి సక్సెస్ అందుకుంది. రూ.50 కోట్ల బడ్జెట్ తరుపున సినిమా రూ.800 కోట్లకు పైగా లాభాలను అర్జించి బయ్యర్లకు డబ్బుల వర్షం కురిపించింది. అలాగే మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంజుమల్ బాయ్స్ కూడా రూ.100 కోట్లకు పైగా లాభాలను రాబట్టి నిర్మాతలను లాభాల్లో ముంచేసింది. ఇక మన టాలీవుడ్ లో అయితే ఏడాది మొదట్లోనే వచ్చిన హనుమాన్ కేవలం రూ.25 కోట్లు బడ్జెట్ తో రూపొంది ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ.100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. దీని తర్వాత కల్కి వచ్చింది. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లోను హైయెస్ట్ గ్రాస్ సంపాదించుకున్న సినిమాల్లో స్త్రీ2 కూడా ఒకటి. మలయాళం మంజుమల్ బాయ్స్ కూడా రూ.20 కోట్లతో తెరకెక్కి రూ.242 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది అంటే దాదాపు రూ.150 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ప్రేమలు సినిమా అయితే కేవలం రూ.4 కోట్లతో వచ్చి ఏకంగా రూ.140 కోట్లు సంపాదించింది. అలా కేవలం రూ.50 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు రూ.100 కోట్ల పైన లాభాలను అర్జించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.