సినీ ఇండస్ట్రీలో మొదటి చైల్డ్ ఆర్టిస్టులకు అడుగు పెట్టి.. తర్వాత స్టార్ హీరో, హీరోయిన్గా రాణిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలా మన టాలీవుడ్ లో కూడా మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి.. తర్వాత హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఒకటి, రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత కనుమరుగైపోయారు. కాగా వారు నటించింది ఒకటి, రెండు సినిమాలే అయినా వారి నటనతో మాత్రం ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయారు. అలాంటి వారిలో డాడీ సినిమాలో చిరంజీవి కూతురుగా నటించిన అమ్మడు కూడా ఒకటి.
చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా 2001లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో కూతురుగా నటించిన పాప.. తన క్యూట్ క్యూట్ మాటలతో, లుక్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తుంటే.. ఆమెను చూసి ఈ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుందో.. ఎలా ఉందో.. అనే సందేహాలు చాలా మందిలో మొదులుతాయి.
ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.. తనే అనుష్క మల్హోత్ర. డాడీ సినిమా తర్వాత అనుష్క మరే సినిమాలోను నటించలేదు. కేవలం చదువుపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్ అనే రేంజ్‌లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా ఉండని అనుష్క.. అప్పుడప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను మాత్రం అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం అనుష్క మల్హోత్రా షేర్ చేసిన గ్లామర్స్ ఫొటోస్ నెటింట తెగ వైరల్‌గా మారాయి.