దారుణాతి దారుణంగా ఓడిపోబోతున్న జగన్ .. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న “త్రివిక్రమ్” సూపర్ హిట్ డైలాగ్..!

కేవలం కొద్దిగంటలే మరికొద్ది గంటల్లోనే ఏపీలో కొత్త పార్టీ అధికారం చేపట్టబోతుంది. కూటమి ఏపీలో అధికారం చేపట్టబోతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ కూడా క్లారిటీ ఇచ్చేసాయి . ఇప్పటివరకు సర్వేలో వెల్లడైన ఆన్సర్ ద్వారా కూడా కూటమినే ఏపీలో అధికారం చేపట్టబోతుంది అంటూ క్లారిటీకి వచ్చేసింది . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. అంతేకాదు తమదైన స్టైల్ లో కౌంటర్స్ కూడా వేస్తున్నారు . కాగా అ ఆ సినిమాలో రావు రమేష్ ఒక డైలాగ్ చెప్తాడు .

“శత్రువులు ఎక్కడో ఉండరు రా ..మన ఇంట్లో మన ముందే భార్యా ..తల్లి.. చెల్లి రూపంలో తిరుగుతూ ఉంటారు అని ఒక డైలాగ్ చెప్తాడు . ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది .. చాలామందిని అట్రాక్ట్ చేసింది “. అయితే ఇప్పుడు అదే డైలాగ్ను ట్రెండ్ చేస్తున్నారు ఏపీ జనాలు . వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం వైఎస్ షర్మిల .. వైయస్ విజయమ్మ నే అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సొంత చెల్లి సొంత తల్లి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏపీ జనాలు ఆయనకు సపోర్ట్ ఎలా చేస్తారు..? అంటూ ఈ డైలాగ్ ను బాగా వైరల్ చేస్తున్నారు .

ప్రజెంట్ సోషల్ మీడియాలో వైయస్ జగన్ పేరు దారుణతి దారుణంగా ట్రోలింగ్కి గురవుతుంది . ఆఫ్ కోర్స్ గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కూడా ఇలాంటి ట్రోలింగ్స్ బాగా చేశారు.. ఇంకా దారుణాతి దారుణమైన పదాజాలంతో చంద్రబాబు నాయుడుని ఆయన కుటుంబాన్ని దూషించారు. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ను వైసిపి బ్యాచ్ ఎలా ఆడేసుకుందో అందరికీ తెలిసిందే . టైం ఎప్పుడూ ఎవ్వరికీ ఒకేలా ఉండదు. బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చెప్పడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం అంటున్నారు అభిమానులు. మరికొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయ చరిత్ర మలుపు తిరగబోతుంది అన్నది మాత్రం వాస్తవం అంటూ ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు..!!