సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..అన్ని అవుతాయా ఏంటి బ్రో..వైరల్ అవుతున్న బాలయ్య హిట్ డైలాగ్..!

మనకు తెలిసిందే.. మరికొద్ది నిమిషాలలోనే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు . దీనికి సంబంధించిన పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం జనాలతో కిక్కిరిసిపోతుంది . ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు.. పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు.. సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు .

కాగా చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ అందరూ కలిపి 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు . అయితే ఇదే క్రమంలో వైసిపిని బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. రకరకాల మీమ్‌స్ తో ఆటాడేసుకుంటున్నారు .. అన్ని బాగా చేసుంటే..నువ్వే ఈసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఉండేవాడివి జగన్ అని జగన్ ఫ్యాన్స్ చెప్తూ ఉంటే .. కొంతమంది బాలయ్య సినిమాలోని హిట్ డైలాగ్ ని బేస్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు.

“సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ..అన్నీ జరుగుతాయా ఏంటి..?” అంటూ బాలయ్య సినిమా డైలాగులు జగన్ కి అప్లికేబుల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మీమ్‌స్ బాగా బాగా ట్రోల్ అవుతున్నాయి. మొత్తానికి ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోయి తనదైన స్టైల్ లో స్ట్రాటజీలను అప్లై చేసి..ఏపీ కూటమి అధికారం చేప్పట్టే విధంగా చేశాదు..!!