రష్మిక టాటూ మెడపై వేసుకున్న యంగ్ హీరో.. మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇటీవల బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు యంగ్‌ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఆనంద్.. వెంటనే ఉదయ్ శెట్టి డైరెక్షన్లో గం గం గణేశా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు వంశీ కారమంచి, కేదార్ శెలగం సంయుక్తంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ ఎంటర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం సినిమా ఫ్రీ రిలీజ్ గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. దీనికి రష్మిక స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఈ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ మూవీ టీం ను విష్ చేసింది.

Gam Gam Ganesha - Official Teaser | Anand Deverakonda, Pragati Srivastava,N  Sarika | Uday Bommisetty - YouTube

తర్వాత బేబీ సినిమా చూసిన తర్వాత.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నన్ను కదిలించాయంటూ చెప్పుకొచ్చింది.. రష్మిక ఈ సినిమా చూసే టైంలో నేను కంటతడి పెట్టుకున్నానని ఎప్పటికైనా నాకు అవకాశం వస్తే డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. దీంతో సాయి రాజేష్ కూడా ఎమోషనల్ అయ్యారు. అలాగే గం గం గణేశా టీంకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మనకంటూ ఒకరి సపోర్ట్ ఉండడం అవసరం. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక నేను అదే ఫీల్ అయ్యా. నేను ఆనంద్ మీద చాలా డిపెండ్ అవుతా. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఆనంద్ మోహంలో నవ్వు వస్తుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా అంటూ వివరించింది.

Anand Devarakonda's Question lands Rashmika in a Romantic Fix - Telugu News - IndiaGlitz.com

అదే విధంగా ఇందులో ఆనంద్, రష్మిక మధ్య కాన్వర్జేషన్ నెటింట తెగ వైరల్ గా మారింది. ఈ కాన్వర్జేషన్ లో ఆనంద్ ఆమెను తన మెడ పై ఉన్న టాటూ ఏంటో చెప్పమని ప్రశ్నించాడు. అది రష్మిక అంటూ ఆమె వివరించింది. అది రష్మిక కాదు పుష్ప మూవీలో అల్లు అర్జున్‌తో నటించిన శ్రీవల్లి పేరు అంటూ ఆనంద్ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా అసలు ఈ టాటూ ఎవరి కోసం వేయించుకున్నానో చెప్పమని రష్మికను ప్రశ్నించాడు.. దానికి ఆమె నిరాకరించింది. దీంతో అతను రష్మిక పేరును ఎందుకు వేసుకున్నాడు అనే అంశం నెటింట వైరల్ గా మారింది. అసలు రష్మిక పేరు వేసుకోవాల్సింది విజ‌య్‌ కదా.. అతని తమ్ముడు ఎందుకు వేసుకున్నాడు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.