మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ అప్డేట్.. వాళ్లని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటూ..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజాగా విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఇంట్రీ పై అదిరిపోయే అప్డేట్ అందించాడు బాలయ్య. మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు బాలయ్య. మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చెప్పుకొచ్చిన ఆయన.. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడని.. అయితే సినిమాల్లోకి వచ్చే విషయంలో తనని గాని, తాత గారిని గాని స్ఫూర్తిగా తీసుకోవద్దని తాను చెబుతున్నానంటూ వివరించాడు.

Nandamuri Balakrishna Speech @ Gangs of Godavari Pre Release Event |  Vishwak Sen | Krishna Chaitanya - YouTube

యంగ్ హీరోల‌ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తాను సినిమాల్లోకి రావాలని చెబుతానని వివరించాడు. విశ్వక్, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ లాంటి మన కుర్రాళ్ల టీమ్ ని స్ఫూర్తిగా తీసుకోమని చెప్తుంటాను అంటూ వివరించాడు. బాలయ్య ఈ జనరేషన్ యంగ్ స్ట‌ర్స్ ఎలా రాణిస్తున్నారో చూసి నేర్చుకోవాలని వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడి ఎదగాలంటే మోక్షజ్ఞకు చెప్పానని బాలయ్య వివరించాడు. ఎప్పటికప్పుడు కొత్తదనం సినిమాలలో చూపించాలని నాన్నగారు భావించేవారు.. ఆయన నుంచి నేను అదే నేర్చుకున్నా.. దాన్నే ఫాలో అవ్వమని ఇప్పటి జనరేషన్ హీరోలకు కూడా నేను చెప్తా అంటూ ఆయన వివరించాడు.

Why Is 'Gangs Of Godavari' Getting Delayed?

విశ్వక్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రలో కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సెన్సార్ పూర్తి చేసుకుని u/a సర్టిఫికెట్ సాధించిన ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ లెవెల్ లో జరిగింది. మూవీ గురించి బాలయ్య మాట్లాడుతూ ట్రైలర్, టీజర్ చూశానని.. ఎంతో బాగున్నాయని.. గోదావరి అందాలతో పాటు మంచి ఎమోషన్స్ ఉన్న సినిమాల ఉందని బాలయ్య వివరించాడు. టైటిల్ డిఫరెంట్‌గా ఉంద‌ని.. సినిమా భారీ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అంటూ వివరించాడు. సక్సెస్ మీట్ లో మ‌రిని విషయాలు మాట్లాడతానని చెప్పిన బాలయ్య.. దర్శకుడు, నిర్మాతలు, హీరోయిన్ లందరికీ అభినందనలు అంటూ తెలియజేశాడు.