లేవలేని పోజీషన్ లో స్టార్ హీరోయిన్.. పరిస్ధితి ఎంత దారుణంగా ఉంది అంటే(వీడియో)..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది .. బాగా వైరల్ గా కూడా మారింది.. ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు సీనియర్ నటి రాధిక. ఎస్ సీనియర్ నటి రాధిక కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి అలరించిన రాధిక.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే స్థాయిలో మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

పలు సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూ మెప్పిస్తున్న రాధిక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తునే.. సినిమా లైఫ్ లో కొనసాగిస్తుంది . గత కొంతకాలంగా తల్లి అత్త పాత్రలో మెప్పిస్తూ వచ్చిన రాధిక సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక షాకింగ్ వీడియో షేర్ చేసింది . ఆ వీడియో ఇప్పుడు అందరిని అయోమయంలో పడేసేలా చేసింది . తన అన్నయ్య శివకుమార్ ఇంటికి రావడంతో అతనితో ఒకప్పటి ముచ్చట్లు మాట్లాడుతూ హ్యాపీగా కనిపించింది .

సోఫాపై కదలలేని పరిస్థితుల్లో ఆమె కనిపించడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది. కాలికి గాయమైనట్లు ఆ వీడియో ఆధారంగా తెలుస్తుంది. అంతేకాదు పెద్ద గాయమే అయినట్లుంది. రాధిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు . ఆ వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలని అంటూ మెసేజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.
కాగా రాధిక తన కెరీయర్లో ఎంతోమంది హీరోలతో నటించినా ఆల్ టైం ఫేవరెట్ హీరో మాత్రం చిరంజీవినే అంటూ ఎన్నోసార్లు చెప్పుకు వచ్చింది . అంతేకాదు వీళ్ళ కాంబో సూపర్ డూపర్ హిట్ అవుతుంది . అంతేనా వీళ్ళ కాంబో వచ్చిన ప్రతి సినిమా కూడా కెవ్వు కేకే ..ఏ రేంజ్ లో అంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!