టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జూన్ 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇది. అది కూడా.. కాజల్ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచననాలు నెలకొన్నాయి. అంతకుమించి సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలయ్య స్పెషల్ గెస్ట్ గా రావడం సినిమాకు మరింత హైలెట్‌గా మారింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ గత కొంతకాలంగా జోరుగా చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా మే 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు.
సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా బాలకృష్ణ, అనిల్ రావిపూడి హాజరై సందడి చేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో భగవంత్ కేసరి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కాజల్.. పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ట్రైలర్ లంచ్ వేడుకల్లో బాలకృష్ణ.. కాజల్ అగర్వాల్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సత్యభామ ట్రైలర్ చాలా బాగుందని.. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్ అంటూ.. రకరకాల ఎమోషన్స్ చేయగల అద్భుతమైన నటి.. పాత్రల ఆత్మలోకి వెళ్లి మరీ జీవించేస్తుంది. 16 ఏళ్లలో ఎన్నో డిఫరెంట్ రూల్స్ నటించిన కాజల్ అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ ప్రేక్షకులను ఆకట్టుకుందంటూ వివరించాడు. పెళ్లయిన తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చి మళ్ళీ మా భగవంత్ కేసరితో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.
చాలామంది హీరోయిన్స్‌ను పెళ్లి అయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారని.. అయితే ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ అంటూ ప్రశంసించాడు. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్.. మొదటినుంచి ఆమె సినిమాలు చూసేవాడినని.. ఆమెతో నటించాలని ఉన్నా ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు.. భగవంత్ కేసరిలో మేము కలిసిన నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అంటూ వివరించాడు బాలయ్య. సత్యభామ లో నటించిన కాజల్ మాతో భగవంత్ కేసరిలో నటించిన కాజల్ ఒక్కరేనా అనిపించిందని ఆయన వివరించాడు. సత్యభామ సినిమాకు టీం మంచిగా పని చేశారని.. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. జూన్ 7న అందరూ థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని బాలకృష్ణ కోరాడు.