ఇది నిజంగా నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావిడి జరిగింది. ఆ కారణంగానే బాలకృష్ణ తన సినిమాలను పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ రాజకీయాలపై చేశారు . మే 13న ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు .బాలకృష్ణ సైతం తాను నెక్స్ట్ నటిస్తున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ షూట్ లో పాల్గొనబోతున్నారట . దాదాపు రెండు నెలల క్రితమే ఈ సినిమా షూట్ కి బ్రేక్ చెప్పాడు బాలకృష్ణ .
ఇప్పుడు ఈ షూట్ నెక్స్ట్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారట . అంతేకాదు ఒక సాంగ్ అలాగే రెండు యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నారట. బాబి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూవీను శ్రీకరా స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ అలాగే సౌజన్య నిర్మాణంలో తెరకెక్కుతుంది . ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది .
సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది . 1980 స్టోరీ తో ఫుల్ యాక్షన్ మోడ్లో బాలయ్య ఈ మూవీలో కనిపించబోతున్నారట. రేపు హైదరాబాద్లో ఎన్.బి.కె 109 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు బాలయ్య ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కూడా 100 కోట్లు దాటితే బాలయ్య బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హ్యాట్రిక్ హిట్లు కొట్టిన్నట్లే. మరోసారి 100 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నట్లే . ఇప్పటికే బాలయ్య నటించిన అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా కలెక్ట్ చేస్తే మాత్రం అది ఒక సంచలనం అనే చెప్పాలి..!!