కల్కి 2898 AD నుండి లీకైన కమల్ హాసన్ లుక్..చూస్తే మీ కళ్లని మీరే నమ్మలేరు ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగ్ అశ్వీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ఎన్ని నిద్రలేని రాత్రులు మేల్కున్నాడో మనకు తెలిసిందే . నాగ్ అశ్వీన్.. కూడా ఈ సినిమాను ఒక సినిమాలా కాకుండా తన లైఫ్ లో భావించి తెరకెక్కించాడు . ఈ సినిమాలో దీపికా పదుకొనే అదేవిధంగా దిశాపటాని హీరోయిన్లుగా నటించారు .

అంతేకాదు ఈ సినిమాకి మరొక కీలక మలుపు కమల్ హాసన్ – అమితాబచ్చన్ . ఈ ఇద్దరు సినిమాని మలుపు తిప్పే పాత్రలో నటించారు అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి . కాగా రీసెంట్ గా కమల్ హాసన్ కి సంబంధించిన లుక్ లీక్ అయ్యి వైరల్ గా మారింది . అందరూ అనుకున్నట్టు కమలహాసన్ ఈ సినిమాలో ఏదో ఓల్డ్ గెటప్ లో కనిపించబోతున్నాడు అనే విషయాలకు చెక్ పెట్టేసింది .లీక్ అయిన పిక్చర్ ప్రభాస్ తరహాలో కాస్ట్యూమ్స్ ధరించి యంగ్ లుక్స్ లో కనిపించాడు .

జుట్టు కూడా ఫ్రీగా వదిలేసినట్టుగా ఉంది . అసలు ఈ లుక్కు చూస్తే కమల్ హాసన్ ని ముసలివాడు అని అనుకోరు అలా ఉన్నాడు . ఇది నిజంగానే కల్కి సినిమాలో కమల్ హాసన్ లుక్ నా..? లేకపోతే ఎవరైనా ఎడిట్ చేసి వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారా..? అనే విధంగా జనాలు చర్చించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో లోకనాయకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న కమల్ హాసన్ కల్కి సినిమా లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ లుక్స్ లో కనిపించబోతున్నాడట. చూద్దాం మరి కల్కి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది.