“నువ్వు లేకుండా నేను ఏం చేయలేను”..సమంత ఎమోషనల్ పోస్ట్ కి అర్ధం అదేనా..?

సమంత ..ఈ మధ్యకాలంలో ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కన్నా ట్రోలింగ్ ఎక్కువగా గురవుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే . నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోయింది . పక్కాగా చెప్పాలంటే ఆమె లైఫ్ ఆమెకి కూడా నచ్చడం లేదు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురవడం ఆ తర్వాత సమంత పలు కాంట్రవర్షియల్ విషయాల్లో ఇరుక్కోవడం ..

ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంది అని వార్తలు కూడా విన్నాము. అయితే రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అభిమానులకి కొత్త డౌట్లు పుట్టించింది.” నువ్వు లేకుండా నేను ఏమి చేయలేను” అంటూ ఓ పోస్ట్ పెట్టింది . ఇది చూసిన జనాలు మొదటగా నాగచైతన్య కోసమే అని అంతా అనుకున్నారు. నాగచైతన్య లేకుండా ఆమె ఏమీ చేయలేదు అంటూ డిసైడ్ అయ్యారు.

అయితే సమంత పెట్టిన పోస్ట్ నాగచైతన్యకు సంబంధించి కాదు .. ఆమె తన ఫేవరెట్ కాఫీ గురించి ఈ పోస్ట్ పెట్టింది. ఈ విషయం ఆ తర్వాత అర్థం చేసుకున్నారు ఫ్యాన్స్ . సమంతకి కాఫీ అంటే చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని చాలా సార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చింది . మరోసారి అదే విషయాన్ని పోస్ట్ రూపంలో తెలియజేసింది . సమంత క్లారిటీ ఇచ్చేలోపే ఆ పోస్ట్ కి ద్వంద అర్ధాలు వెతికేశారు జనాలు . అయితే సమంత మాత్రం చాలా సింపుల్ గా తాను చేయాలి అనుకున్న పనిని తాను చేస్తూ ఎంజాయ్ చేస్తుంది..!!