‘ విశ్వంభర ‘ లో నా రోల్ ఇదే.. యంగ్ బ్యూటీ సురభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఇటీవల నటించిన మూవీ గామి. మార్చి 8న ప్రేఓకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు విద్యధ‌ర్ కాగిత‌పు డైరెక్ష‌న్‌లో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తీక్ శ‌భ‌రీష్ ప్రొడ్యూసర్ గా తెర‌కెక్కించారు. చాందిని చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను.. విసెల్యులాయిడ్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ చాందిని చౌద‌రి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను విలేకరులతో షేర్ చేసుకుంది. గామి ప్రాజెక్టు గురించి ఆమె మాట్లాడుతూ మొదటి రోజు నుంచే నేను షూటింగ్‌లో పాల్గొన్నానని.. మను సినిమా టైంలో డైరెక్టర్ విద్యాధర నాకు పరిచయమయ్యారని వివ‌రించింది. గామి అంటే గోల్డ్ సీఖర్.. తను అనుకున్న గమ్యాన్ని చేదించేవాడు అంటూ చెప్పుకొచ్చింది.

Can Chandni Choudhary be the Telugu heroine we are looking for? :  r/tollywood

వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు ఇలా ఎన్నో రియల్ లొకేషన్స్ లో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించాం. అందరం ఒకే బస్సులో వెళ్లి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేసి రిటర్న్ అయ్యేవాళ్ళం. షూటింగ్లో ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నా. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వల్ల వాటర్ కూడా తాగడం మానేసేదాన్ని. దాదాపు నెలపాటు ఇలా షూటింగ్లో క‌ష్ట‌ప‌డ్డాం. ఇందులో చూపించిన స్టంట్స్ నిజంగానే చేశాం. గడ్డకట్టిన మంచుపర్వ‌తాల మీద నడిచినప్పుడు కాళ్లు పగుళ్లు కూడా వచ్చాయి. పొరపాటున కింద పడితే ప్రాణానికి ప్ర‌మాదం. అలాంటి టైం లో నా దగ్గర ఉన్న లగేజ్ ని పారేసి జంప్ చేసి లక్కీగా బయటపడ్డ. ఈ సినిమా షూటింగ్‌లో నా ప్రయాణం ఏదో అడ్వెంచర్స్ జర్నీలా అనిపించింది అంటూ ఆమె వివరించింది.

Gamyaanne The Quest Song Released From Vishwak Sen Gaami Movie✨🎵

ఇక గామికి ఐదోలు పడుతుందని మీకు తెలుసా అని విలేక‌రు ప్రశ్నించగా.. నాకు ఈ సినిమాకు సమయం పడుతుందని తెలుసు. చెప్పే కదా పెద్ద కాన్వాస్ లా అనిపించింది. మేము లిమిటెడ్ స్టాఫ్‌తో షూటింగ్ స్పాట్ కి వెళ్ళాం. పైగా డైరెక్టర్ విద్యాధర్ చాలా పర్టికులర్.. ఆయన అనుకున్నట్లుగా సన్నివేశం వచ్చేవరకు ప్రయత్నిస్తూనే ఉండేవారు. ఎన్నో రకాల వాతావరణ ప‌రిస్థితుల‌లో సినిమా అద్భుతంగా రూపొందింది. దీనివల్ల తప్పకుండా టైం పట్టింది. అంత టైం తీసుకున్నాం కాబట్టి విజువల్స్ అంతా అద్భుతంగా వచ్చాయి. ఐమ్యాక్స్ స్క్రీన్ లో ట్రైలర్ చూసినప్పుడు నేను పడిన కష్టమంతా మర్చిపోయా. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని ఆనందభాష్పాలు వచ్చాయి అంటూ వివరించింది.