స్నేహితురాలి ఇంట్లో కేజీ బంగారం కాజేసి జల్సా చేసిన టాలీవుడ్ హీరోయిన్.. చివరికి ఏం జరిగిందంటే..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. అదే రేంజ్ లో సక్సెస్ ఫుల్ గా రాణించడం కూడా అంతే కష్టం. అలా గతంలో ఎంతోమంది పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించే అవకాశాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాగే ఓపికగా ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇండ‌స్ట్రీకి దూరమై బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తున్న వారు ఉన్నారు. అయితే ఎక్కడో అడపాదడపా సెలబ్రెటీస్ మాత్రమే అడ్డదారులు తొక్కుతూ తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి సంఘటన చోటు చేసుకుంది. వైజాగ్ కు చెందిన ఓ తెలుగు హీరోయిన్ తన స్నేహితురాలు ఇంట్లో కేజీ బంగారం కొట్టేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. అసలు విషయం ఏంటంటే టాలీవుడ్‌లో యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ రీల్స్ చేస్తూ ఆఫర్స్ వెతుక్కుంటుంది ఈ బ్యూటీ. ఓ పక్కన పలు సినిమాలకు ఆడిషన్స్ ఇస్తూ తన ప్రయత్నాల్లో బిజీగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రిటైర్డ్ పోస్టల్ శాఖ ఉద్యోగి ప్రసాద్ బాబు కూతురు మౌనికతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారారు. వీరిద్దరి మధ్యన ఉన్న సానిహిత్యంతో సౌమ్య తరచు వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తూ ఉండేది. వాళ్ళ ఇంట్లో పరిసరాలు వస్తువుల్ని బాగా గమనించిన సౌమ్య ఇంటి నుంచి కిలో బంగారం కాజేసి ఎస్కేప్ అయింది. ఈ క్రమంలో బాత్రూంకి వెళ్లి వస్తాను అని చెప్పి బెడ్ రూమ్‌లో గంటలు గంటలు ఉండేది. ఇలా రెండు మూడు సార్లు కొంచెం కొంచెం బంగారం కాజేస్తూ తన టాలెంట్ బయట పెట్టింది.

మొత్తంగా కిలో బంగారాన్ని మాయం చేసిన సౌమ్య గోవాకు చెక్కేసి జల్సా చేసింది. అయితే ఇటీవల ఏదో ఫంక్షన్ కోసం దాచిన బంగారాన్ని బయటకి తీయడానికి మౌనిక ప్రయత్నించింది. కానీ అక్కడ బంగారం లేకపోవడంతో కుటుంబం అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ.. క్లూల‌తో అనుమానం ఉన్న 11 మందిని విచారించగా.. సౌమ్య శెట్టి వద్ద 74 గ్రాముల బంగారం దొరికింది. దీంతో ఆమె దొంగ‌త‌నాని అంగీకరించింది. ఈ సంఘ‌ట‌న‌తో అంత ఆశ్చర్యపోయారు. అయితే మిగిలిన బంగారం అంతా గోవాలో ఖర్చు చేశానని ఆమె వివరించింది. నేను ఆ డబ్బు తిరిగి ఇవ్వలేనని గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానని భయపెడుతోంది. దీంతో పోలీసులు సౌమ్యని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.