మహేష్ బాబు .. ఇండస్ట్రీలో టాప్ హీరో ..తోపైన హీరో.. కాంట్రవర్షియల్ కంటెంట్ లేకుండా జనాలకు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయకుండా తన పని తాను చూసుకో పోయే ఒక హీరో.. గుంటూరు కారం సినిమాలో నటించాడు. మహేష్ బాబు ఈ సినిమా కి సంబంధించి ఎంతటి ట్రోలింగ్ ఫేస్ చేసాడో మనకు తెలిసిందే .
అయినా మహేష్ బాబు ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. తనదైన స్టైల్ లో ట్రోలింగ్‌ను కవర్ చేసి తన నెక్స్ట్ సినిమాలో ఆ ఇష్యూస్ తలెత్తకుండా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు మహేష్ బాబు . ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది . కాగా మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.
ఫుడ్ డైట్ ఎన్నిసార్లు చెప్పినా ఎంత కఠిన డైట్ అయిన ఫాలో అవుతాడు.. కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండమంటూ.. వెకేషన్స్ అవాయిడ్ చేయమంటే మాత్రం అస్సలు చేయలేదట . ఈ హీరో మొదటి నుంచి ఎంటో అలా అలవాటైపోయిందట. కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం మహేష్ బాబుకి అస్సలు నచ్చని పని అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు మహేష్ బాబు ఫ్యామిలీకి ఇంత ఎడిక్ట్ అయిపోయాడా..?? వెరీ వెరీ నాటి ఫెలో .. వెరీ వెరీ సెన్సిటివ్ హీరో అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పొగిడేస్తున్నారు..!!