“అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏం రా బేవాకూఫ్స్”..బాలయ్య మాటలు వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఎలాంటి వాళ్లకైనా సరే ఇచ్చి పడేయడంలో మన బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా . రీసెంట్గా బాలయ్య తన కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన లెజెండ్ సినిమా పదేళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఓ ఈవెంట్లో పాల్గొన్నారు.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమా 2014లో రిలీజ్ అయింది . అప్పట్లో ఈ సినిమా ఎన్ని సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టించింది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఒకే థియేటర్లో 1000 రోజులు కూడా ఆడి సంచలన రికార్డు నెలకొల్పింది. వంద రోజులు 31 సెంటర్స్ లో ఆడి టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. 70 కోట్లకు వరకు కలెక్షన్స్ వసూళ్లు చేసి సూపర్ డూపర్ హిట్ గా బాలయ్య కెరియర్ లో వన్ ఆఫ్ ది ఫిలిం గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు అవుతున్న శుభసందర్భంగా మార్చి 30న ఈ సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.

దీనికోసం ఓ ఈవెంట్ కూడా పెట్టారు. హైదరాబాదులోని హోటల్లో గ్రాండ్గా ఆ ఈవెంట్ ని సెలబ్రేట్ చేశారు . ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ..” పసుపు శుభానికి సూచకం ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం ..పసుపు సంక్షేమానికి నిర్వచనం ..పసుపు అనేది అభివృద్ధికి సూచకం.. పసుపు అనేది ఆత్మవిశ్వాసం కు నిలువెత్తు రూపం.. ఆత్మగౌరవం ఎగరేసిన కేతనం అంటూ ఓ రేంజ్ లో పసుపు కలర్ ను పొగుడుతూ మాట్లాడారు”.

అంతేకాదు దీనిని చాలామంది పొలిటికల్ గా ట్రోల్ చేస్తున్నారు . బాలయ్య పొలిటికల్ ఇష్యూని సినిమాల పరంగా లేవనెత్తుతూ.. తన పార్టీను ప్రమోట్ చేసుకుంటున్నారు అంటూ కొందరు ఆకతాయిలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్లకు నందమూరి అభిమానులు ఇచ్చి పడేస్తున్నారు . గతంలో ఎంతో మంది పొలిటీషియన్లు సినిమా డైలాగ్స్ ని వాడుకుంటూ తమ పార్టీని పబ్లిక్ సిటీ చేసుకున్నారు .. అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏంరా బేవకూఫ్స్ అంటూ నందమూరి అభిమానులు కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు”.