కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏదైనా సినిమాలో నటిస్తుంటుంది చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‌కు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ కు తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నోటీసులు పంపించింది. డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించేందుకు.. కొచ్చిలోని ఎన్‌ఐఏ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆదిలింగం అనే ఓ వ్యక్తి వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్గా పనిచేశాడు. డ్రగ్స్, ఆయుధాలు సరఫరాలో అంతర్జాతీయ స్మగ్లర్‌లతో అతనికి సంబంధాలు ఉన్నట్లు.. ఎన్ఐఏ అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జరిగిన ఎంక్వయిరీలలో ఆమె అసిస్టెంట్ ఆదిలింగం వద్ద నుంచి రూ.2,100 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్, ఏకే 47 గన్, 9 ఎంఎం తుపాకులు, మందు గుండు సామాగ్రిని ఎన్ఐఏ అధికారులు గుర్తించి అసామాగ్రిని సీజ్ చేశారు.
స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగులోనూ తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, క్రాక్, నాంది, వీర సింహారెడ్డి, హనుమాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. మొదటి తమిళ్ ఇండస్ట్రీలో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతుంది. ఇక రీసెంట్గా ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో వరలక్ష్మి ఇలా చిక్కుల్లో పడడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.