మహేష్ శ్రీమంతుడే కాదు మహర్షి కూడా కాపీనే.. శరత్ చంద్ర సెన్సేషనల్ కామెంట్స్..

శ్రీమంతుడు స్టోరీ కాపీ అంటూ శరత్ చంద్ర అనే రైటర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొర‌టాల‌ శివ ఇప్పటికీ దానిపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. శ్రీమంతుడు కథ విషయంలో కొరటాల క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే కొర‌టాల‌ శివ ఆనవల నుంచి ఈ సినిమాను కాపీ కొట్టలేదని ప్రూవ్ చేస్తే మాత్రం కొరటాల శివకు ఇబ్బంది ఉండదు. కాగా కొరటాల శివ.. శ్రీమంతుడు సినిమాతో పాటు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన మహర్షి కూడా కాపీ అంటూ శరత్‌చంద్ర కామెంట్స్ చేశాడు.

What is Srimanthudu 'plagiarism' case? Novelist Sarath Chandra asserts he  will not compromise, calls out Koratala Siva, Mahesh Babu, Chiranjeevi,  Pawan Kalyan | Telugu News - The Indian Express

భవిష్యత్తులో తన కోర్టును ఆశ్రయిస్తానని చెప్పిన శరత్‌చంద్ర తను సమాహారం అనే నవల రాయగా ఆ నవలలో రాసుకున్న సీన్లు మహర్షి సినిమాలో ఉన్నాయి అంటూ వివరించాడు. అయితే శరత్చంద్ర చేసిన ఈ కామెంట్లు పై మహర్షి మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా సినిమా స్టోరీలు.. ఓ సినిమాతో మరొకటి పోలి ఉండడం సహజం. అయితే కొంతమంది దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఉండేవి ఏడు కథలు మాత్రమేనని.. ఆ ఏడు కదలని తిప్పితిప్పి సినిమాలు తీస్తున్నామని వివరించారు.

ఇక శరత్‌చం ద్ర చచ్చేంత ప్రేమ నవలకు కూడా రవితేజ నటించిన భగీరథ మూవీ తో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే ఆ సినిమా నుంచి ఈ నవల రాశాడు అని కాపీరైట్స్ వేస్తే అంగీకరిస్తాడా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సినిమాకు సంబంధించిన ఈ తరహా కాపీ ఆరోపణలు వచ్చే ఛాన్స్ మరింత ఉంది. మగధీర, బాహుబలి సినిమాలు రిలీజ్ అయిన టైంలో ఈ సినిమాల కథలు కూడా ఇతర సినిమాలతో, నవలలతో పోలికలు ఉన్నాయంటూ పలు విమర్శలు వినిపించాయి. ఇక శ్రీమంతుడు కాపీరైట్స్ కేస్ విషయంలో కొరటాల శివ ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.