అభిషేక – ఐశ్వర్య విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన ఐశ్వర్య.. ఏం చేసిందంటే..?

బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య గొడవ పడిందని.. విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కాన్ని ఎక్కడా ఖండించలేదు. కనీసం స్పందన కూడా లేదు. దీంతో ఐశ్వర్య – అభిషేక్ నిజంగానే డైవర్స్ తీసుకుంటున్నారు అంటూ మరింత బలం చేకూరేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటికీ ఒక్కసారిగా స్ట్రాంగ్ రిప్లైతో చెక్ పెట్టింది ఐశ్వర్య.

Anniversary Special: Things You Don't Know About Abhishek's Love Story With  Aishwarya Rai Bachchan | HerZindagi

తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా ఓ అందమైన ఫోటోను షేర్ చేసింది. సోమవారం అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయ‌న‌కు విషెస్ తెలియజేశారు. ఇక ఉదయం నుంచి పలువురి నుంచి బర్త్డే విషెస్ అందుకున్న అభిషేక్ బచ్చన్ కు ఐశ్వర్యరాయ్ మాత్రం విష్ చేయకపోవడంతో మరోసారి వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక కాస్త ఆలస్యమైన ఐశ్వర్య ఈ రూమర్లకు చెక్ పెడుతూ స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చింది. అందమైన ఫోటోలు షేర్ చేసుకుంటూ తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఐశ్వర్య విషెస్ తెలియజేస్తూ ఇదిగో మీకు ఇవే నా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషంగా, ప్రేమతో, ప్రశాంతతతో, శాంతి, ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలని మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్న అంటూ స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేసింది. ఐశ్వర్యఈ ఫోటోలు అభిషేక్, ఐశ్వర్యరాయ్ తో పాటు కూతురు ఆరాధ్య కూడా ఉంది. ముగ్గురు హ్యాపీగా దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోతో ఐశ్వర్య తమ విడాకుల గురించి వచ్చే వార్తలకు సరైన సమాధానం ఇచ్చిందంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.