రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ‘ టిల్లు స్క్వేర్ ‘ డిజిటల్ రైట్స్.. ఎన్నికోట్లో తెలిస్తే ఫ్యూజలు ఎగిరిపోతాయి..

కంటెంట్ ఉంటే చాలు సినిమా ఎంత చిన్నదైనా సరే బ్లాక్ బస్టర్ పక్కా అని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ చాలాసార్లు నిరూపించారు. అలా చిన్న సినిమాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సినిమా డీజే టిల్లు ఒక‌టి. ఈ సినిమాతో సిధ్ధు కెరీర్‌ మారిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటిగా పాపులర్ అయిన సిద్దు.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. టైర్ 2 హీరోల రేంజ్‌లో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుంది. టిల్లు స్క్వేర్ టైలర్ తో మేకర్స్ వేసిన మాస్టర్ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది. బిజినెస్ పరంగా భారీ క్రేజ్ వచ్చింది.

Tillu Square - Play & Download All MP3 Songs @WynkMusic

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ దియేట్రిక‌ల్ రైట్స్ ఏకంగా రూ.35 కోట్లకు అమ్ముడుపోయాయట. వ్యక్తిగతంగా సిద్దు జొన్నలగడ్డకు అంత మార్కెట్ లేకపోయినా టిల్లు మూవీ కి ఉన్న బ్రాండ్.. క్రేజ్ రీత్యా దీనికి బయ్యర్లు ఆ రేంజ్ లో కొనుగోలు చేసినట్లు సమాచారం. టైర్ 2 హీరోలా రేంజ్ కి ఈక్వల్‌గా ఈ సినిమా బిజినెస్‌లు జరుగుతున్నాయి. ఇక టాలీవుడ్ లో భారీ పాపులారి దక్కించుకున్న స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించడంతో సినిమాకు మరింత ప్లస్ అయింది. త్రీ మినిట్స్ ట్రైలర్ లోనే అన్ని శాంపిల్స్ చూపించేసి అరాచకం సృష్టించారు మేకర్స్. ఇక ఫుల్ మూవీ లో ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

siddhu jonnalagadda Songs - Play & Download Hits & All MP3 Songs!

అయితే డిజే టిల్లు ఫస్ట్ పార్ట్ డిజిటల్ మీడియా ఆహాకు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సీక్వెల్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. మార్చి మొదటి వారి నుంచి టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. వారం రోజుల గ్యాప్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేనే ఈ సినిమా మరింత సక్సెస్ సాధిస్తుంది. ఇక మ‌ధ్య‌లో ఆపరేషన్ వాలంటైన్, గామి, భీమా, ఆ ఒక్కటి అడక్కు ఇలా పలువురు హీరోల సినిమాలు వరుసగా వస్తున్నాయి. అయితే వీటన్నిటిలో యూత్ ఛాయిస్ టిల్లు స్క్వేర్ అనడంలో సందేహం లేదు. మరి భారీ హైప్‌తో వస్తున్న ఈ సినిమా ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.