పెళ్లి బట్టల్లో కలకల్లాడిన బిగ్ బాస్ వాసంతి.. ఫొటోస్ వైరల్..!

బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమస్ అయిన వాసంతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని తన సత్తా చాటుకుంది.

ఇక ప్రస్తుతం ఇటీవలే ఈమెకి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. తిరుపతికి చెందిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ అనే ఓ వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. ఇక వీరిద్దరికీ ఇటీవలే పెళ్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోస్ ని చూసిన కొందరు..” పట్టు చీరలో వాసంతిని చూస్తుంటే నిజంగా చాలా క్యూట్ గా ఉంది. ఈమె అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా సరిపోరు. సో క్యూట్. అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వాసంతి.. నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట చర్చగా మారాయి.