బిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..”దంగల్” నటి మృతి..!!

ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీకి బ్లాక్ డే అని చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి . ఒక స్టార్ సెలబ్రిటీ మరణించాడు అన్న విషాదఛాయలు మరవకముందే మరొక స్టార్ సెలబ్రిటీ చనిపోయాడు అన్న వార్తలను మనం వింటున్నాం. ఇది అభిమానులకి చాలా చాలా బాధాకరం. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ చాలామంది లెజెండ్స్ ని.. స్టార్స్ ని పోగొట్టుకుంది .

కొందరు హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా మరణిస్తే .. మరి కొందరు వయసు పైబడడంతో మరణిస్తూ వచ్చారు. మరికొందరు హార్ట్ ఎటాక్ కారణంగా మరికొందరు పర్సనల్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వచ్చారు . కాగా చాలా చిన్న వయసులోనే అసలు లోకమంటే ఏంటి అని చూడకముందే ఈ ఇండస్ట్రీని.. తన బంధువులని.. స్నేహితులని వదిలి వెళ్ళిపోయింది ఓ నటి. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టిమట వైరల్ గా మారింది .

సినిమా ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్న అమీర్ ఖాన్ “దంగల్” సినిమాలో నటించిన సుహాని భట్నాగర్ మృతి చెందింది. ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసర్ గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీలో అమీర్ తో పాటు ప్రధాన పాత్రల్లో హీరో కూతుర్లుగా నటించిన ఫాతిమా , సన్యా , సుహాని భట్నాగర్ కూడా తమ నటనతో అదరకొట్టేశారు.

సుహాని భట్నాగర్ 19 ఏళ్ల వయసులోనే మరణించింది . ఇప్పుడు ఈ విషయమే అందరికీ షాకింగ్ అనిపిస్తుంది. కొన్నేళ్ల క్రిందట సుహానికి ఆమె కాళ్ళకి గాయం అయింది . ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు రియాక్షన్ కొట్టాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడం మొదలైంది . పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూపించిన ప్రయోజనం లేకుండా పోయింది . చిన్నవయసులోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.