మహేశ్ బాబు “అతడు” సినిమాలోని ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ హీరో.. గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా మారిపోతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువైపోతుంది.  ఇప్పటికే చాలామంది స్టార్స్ అలా పెద్దయ్యాక హీరోలు హీరోయిన్లుగా మారిపోయారు . రీసెంట్ గా తేజ సజ్జ హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు . బలగం సినిమాతో కావ్య హీరోయిన్గా మారిపోయి వరుస హిట్లు అందుకుంటుంది.. వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

ఇప్పుడు అదే కోవాలోకి వస్తున్నాడు మహేష్ బాబు అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ బుడ్డోడు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బుడ్డోడి పేరు దీపక్ సరోజ్. ఇప్పుడు హీరోగా మారిపోయాడు . అర్జున్ రెడ్డికి మించిపోయే రేంజ్ లో కటౌట్లతో దర్శనమిస్తున్నాడు.  కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఆయన చేస్తున్న మూవీ సిద్ధార్థ రాయ్ . ఈ సినిమా ట్రైలర్ టూ హాట్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఒక అర్జున్ రెడ్డి ఒక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే గుర్తుకు వస్తున్నాయి .ఆ రేంజ్ లో బోల్డ్ కంటెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు . ప్రెసెంట్ దీపక్ సరోజ్ పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాతో హీరోగా కూడా పేరు తెచ్చుకొని దీపక్ సరోజ్ వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.