నిహారికకు ఆడపడుచు కట్నం ఎంత ఇచ్చారు.. రిపోర్టర్లకు మెగా కోడలు దిమ్మతిరిగే సమాధానం..

టాలీవుడ్ బ్యూటీ సొట్ట‌ బుగ్గల సుంద‌రి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం సినిమాలో షూటింగ్లో ప్రేమలో పడి కొంతకాలం ప్రేమాయణం తర్వాత వివాహ బంధం లోకి అడుగు పెట్టారు. గత ఏడాది నవంబర్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే 2021 డిసెంబర్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా లవ్ ప్రపోజ్ చేసి ఓకే చేయించుకున్నాడు వరుణ్ తేజ్. అప్పటినుంచి ప్రేమాయణం నడిపిన ఈ జంట ఎప్పుడు కెమెరా కళ్ళకు కూడా చిక్కలేదు.

అంత సీక్రెట్ గా వీరి లవ్ ఎఫైర్ నడిచింది. అయితే మెగా ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్లు వేడుకల్లో మాత్రం లావణ్య సందడి చేస్తూ ఉండేది. కానీ వరుణ్ చెల్లెలు నిహారిక.. లావణ్య మంచి స్నేహితులు కావడంతో గెస్ట్ ల వచ్చిందని అందరు భావించారు. అయితే తన సీక్రెట్ లవ్ గురించి లావణ్య పలు సందర్భాల్లో హింట్ ఇచ్చిన ఎవరూ గెస్ చేయలేకపోయారు. మొత్తానికి తమ ప్రేమ నిజం చేసుకొని మెగా కోడలుగా లావణ్య అడుగుపెట్టింది. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో లావణ్య కు ఒక ప్రశ్న ఎదురయింది.

సాధారణంగా వివాహ సమయాల్లో వరుడు అక్కచెల్లెళ్లకు ఆడపడుచు కట్టడం ఇస్తూ ఉంటారు.. బంగారాన్ని లేదా డబ్బును వారికి చదివిస్తూ ఉంటారు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా జరిగే విషయం. ఇక లావణ్య కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. వరుణ్ సిస్టర్ నిహారికకు మీరు చాలా క్లోజ్.. మరి మీ మ్యారేజ్ టైం లో ఆమెకు ఆడపడుచు కట్నం గా ఏం ఇచ్చారు అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మెగా కోడలు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది.

Lavanya Tripathi's "Miss Perfect" Web Series teaser out now

తన మ్యారేజ్ టైం లో మేము ఎలాంటి ఆడపడుచు కట్నాలు ఇవ్వలేదు,, కానీ నిహారిక ఏది అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా,, తను మా ఫ్యామిలీ మెంబర్ ఏ,, మంచి స్టోరీ ఉంటే తన బ్యానర్లో ఓ సినిమాను రెమ్యూనరేషన్ లేకుండా కూడా చేస్తాను అంటూ వివరించింది, దీంతో మెగా కోడలు అంటే ఇలానే ఉండాలి అంటూ.. మెగా కోడలా మజాకానా.. ఈ రేంజ్ లో సమాధానం ఉంటుంది మరి అంటూ.. ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య మొదటిసారి నటించిన సిరీస్ మిస్ పర్ఫెక్ట్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.