ఫైనల్లీ..క్లిం కార ఫోటో షేర్ చేసిన ఉపాసన్.. ఎంత ముద్దుగా ఉందో.. అచ్చం పోలికలు అవే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కూతురు క్లింకార. ఉపాసన – రాంచరణ్ లకు పెళ్లి అయిన 11 ఏళ్లకు పుట్టిన బిడ్డ . మెగా ఫ్యామిలీలో క్లింకార.. వచ్చిన తర్వాత అన్ని శుభాలే జరుగుతున్నాయి. అంతేకాదు మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. క్లింకారా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే .

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పలువురు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనకు విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన చిరంజీవి కు స్పెషల్గా విష్ చేసింది. “మీరు చూస్తుంది ఒక శక్తివంతమైన పిడికిలి నుంచి ఐదు వేళ్లి సినిమా పరంగానే కాదు ..ఒక నాన్నగా.. ఒక మామగా.. ఒక తాతగారిగా మీకు పద్మ విభూషణ్ వచ్చినందుకు అభినందనలు “అంటూ పోస్ట్ చేసింది .

ఆ ఫోటో లో చిరంజీవి తన మనవరాలతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది . ఈ ఫోటోలో క్లిం కారా కూడా ఉండడం గమనార్హం. అయితే ఎప్పుడు క్లిం కార ఫేస్ చూపించాలి అన్న ఫోటో పైన ఏదో ఒక లవ్ ఎమోజిని పెట్టేవాళ్ళు ..కానీ ఈసారి కొంచెం బ్లర్ చేస్తూ ఇంచుమించుగా పాప ఫేస్ ను రివిల్ చేసే విధంగానే చూపించేశారు. పోలికలు మాత్రం అచ్చం చరణ్ లానే ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో క్లింకార తాజా ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి..!!