ఏంటి ..నటసింహం తోనే పరాచకాల.. బాలయ్యకు తిక్క రేగితే ఇలానే ఉంటాది(వీడియో)..!!

మనకు తెలిసిందే బాలయ్యకు ముక్కు మీద కోపం . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . తేడా వస్తే అక్కడే తేల్చేస్తాడు. ముఖాన ఒక మాట ముఖం వెనక ఒక మాట మాట్లాడే తత్వం మన బాలయ్యది కాదు . రీసెంట్గా మరోసారి అలాంటి వీడియో నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ప్రెసెంట్ నందమూరి బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోని ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.

కాగా రీసెంట్ గా బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . బాలయ్య కోసం ఎంతోమంది వచ్చారు . వాళ్ళను చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించాడు మన బాలయ్య . అయితే ఒక అభిమాని బాలయ్య కోసం బొకే తెస్తాడు . బొకే తెచ్చి ఆయనకి ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంటాడు. దీంతో కోపం వచ్చిన బాలయ్య ఏంటి అటూ ఇటూ చూస్తున్నావు ..

అనగానే అభిమాని బొకే ఇస్తాడు. అయితే బొకే తీసుకొని ఆయన ముందే విసిరి పరేస్తాడు బాలయ్య. ఈ వీడియో అక్కడ ఎవరో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొందరు కావాలనే బాలయ్యను ట్రోల్ చేస్తుంటే మరి కొందరు మాత్రం బాలయ్య తో పరాచకాలు ఆడితే ఇలానే ఉంటుంది అంటూ ఆయనను సపోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ బాలయ్య..బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు..!!