టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి అరుదైన గౌరవం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ వారసత్వం అందుకున్నాక మెగా ఫాన్స్ ఎక్కువగా ఆయనకు సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్ గానే మెగా వారసుడు రామ్ చరణ్ కు ఉపాసనకు పండు లాంటి పాప జన్మించింది . క్లిం కార అంటూ నామకరణం చేసి అభిమానులకు ఆమె పేరుని తెలియజేశారు .
ఇప్పటివరకు క్లింకార ఒరిజినల్ పిక్ ని షేర్ చేయకపోయినా ఆమె అచ్చం రామ్ చరణ్ లానే ఉంటుంది అంటూ మురిసిపోతున్నారు మెగా ఫాన్స్ . క్లిం కార ఫేస్ ఎప్పుడు చూపిస్తారో అంటూ ఎదురు చూస్తున్నారు . రీసెంట్గా చరణ్ దంపతులు ముంబై వెళ్లారు . అది కూడా క్లీం కారని తీసుకొని . జనరల్‌గా క్లీం కార ను బయట తిప్పడానికి ఇష్టపడరు . కానీ పాపని తీసుకొని మరి ముంబైకి వెళ్లడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
జూన్ 20న క్లింకార పుట్టింది . తాజాగా క్లీం కారాకు ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిం కారతో కలిసి ముంబైలోని ఫేమస్ టెంపుల్ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు . దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . ఆలయం వద్ద చరణ్ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఆసక్తి చూపించారు . కానీ ఉపాసన మాత్రం పాప ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది…!!
మెగా ఫ్యామిలీ లైఫ్ లో మర్చిపోలేని రోజు..అందుకే ముంబై మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతులు స్పెషల్ పూజలు..!
