మీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. ఈజీగా ఆ అలవాటు మానిపించేయండి ఇలా..

ఒకప్పటి కాలంలో చందమామ రావే.. జాబిల్లి రావే అని పాటలు పాడుకుంటూ చిన్న పిల్లలకు అన్నం తినిపించేవారు. అమ్మ జోల పాడితే కంటి నిండా చంటి పిల్లలను నిద్రపోయేవారు. మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీని బట్టి ఇవన్నీ కనుమరుగైపోయాయి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్న పేరెంట్స్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్‌కు ముసలి వారి నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అయిపోతున్నారు.

ఈ ఫోన్ను ఎక్కువగా వాడడం వల్ల వారు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్నపిల్లలు ఫోన్కు ఎడిట్ అవ్వడం ద్వారా పలు కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ఎక్కువగా అలవాటు పడటంతో తల్లిదండ్రులతో కంటే ఫోన్ తోనే ఎక్కువ టైం లో స్పెండ్ చేస్తున్నారు. ఫోన్ కు ఇచ్చే టైం తల్లిదండ్రులతో స్పెండ్ చేయడానికి ఇష్టపడడం లేదు. అలా ఫోన్ అడిక్ట్ అయిపోయిన పిల్లలను ఆ అలవాటు నుంచి మార్పించడం ఎలాగో ఈ సింపుల్ టిప్స్ తో చూద్దాం.

ఇంట్లో ఉండే పెద్దవాళ్ల నుంచే పిల్లలు అన్ని విషయాలను నేర్చుకుంటారు. తమ ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ ఎలా వాడుతున్నారో పిల్లలు కూడా అదే విధంగా వాడాలనుకుంటారు. భోజనం టైం లో, ఖాళీ దొరికినప్పుడు ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తే.. పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా అదే చేయాలనుకుంటారు. అందుకే పిల్లల ముందు మొబైల్ వాడుకని తగ్గించుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఫోను పక్కన పెట్టి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి.

పిల్లలకు చిన్న వయసు నుంచే స్టోరీ బుక్స్, స్టోరీస్ చదివించడం అలవాటు చేస్తే వారు ఆ విధానానికి అలవాటు పడతారు. దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివిస్తూ ఉంటే వారిలో కూడా దేశంపై భక్తీ అలవడుతుంది. పడుకునే టైంలో మంచి స్టోరీస్ చెప్తే వారికి అవి మెదడులోకి త్వరగా ఎక్కుతాయి. వాటి నుంచి వచ్చే మంచిని వాళ్ళు నేర్చుకుంటారు.

పూర్వం పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు ఆరుబయట ఆడుకునేవారు. కానీ ఇప్పుడు బ్యాగ్‌ ను విసిరేసి గబగబా మొబైల్ పట్టుకొని అందులో బొమ్మలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫోన్లో గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. అయితే బయట పిల్లలతో ఆడుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. అదేవిధంగా ఎవరితోనైనా త్వరగా కలిసిపోయే తత్వం ఏర్పడుతుంది. సెలవులు ఉన్నప్పుడు కూడా పిల్లలు ఫోన్ కి అలవాటు పడకుండా ఉండాలి అంటే గార్డెనింగ్, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటి ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీలను పిల్లలకు నేర్పించడం మంచిది. దీంతో వారికి ఫోన్ వాడాలనే అలవాటు తగ్గుతుంది.