కోట్లాది మంది నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేసిన క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం లో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్..!

ప్రెసెంట్ నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమా మొత్తానికి ఎన్టీఆర్ పర్ఫామెన్స్ హైలెట్ గా ఉండబోతుంది అంటూ మేకర్స్ ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తుంది . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నాడు .

ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో దేవరా పార్ట్ 2 చేస్తాడు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక క్రేజీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకు కమిట్ అయ్యారట . అంతేకాదు కమర్షియల్ సినిమా కాకపోయినప్పటికీ ఈ సినిమా ద్వారా జనాలకు మంచి మెసేజ్ ఇవ్వచ్చు అంటూ వీళ్ళిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారట .

దీంతో కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబో సెట్ అయిపోయింది అంటూ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు జనాలు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇచ్చే మెసేజ్ ద్వార ఆయన పేరు మారు మ్రోగిపోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!