వెధవ బిగ్ బాస్ ట్రోఫీ ..అంతకు మించిన జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన శోభా శెట్టి..!

శోభ శెట్టి రీసెంట్ గానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అన్ని నాళ్లు అమ్మడు చేసిన సందడి అంతా కాదు . అవసరం ఉన్నా లేకపోయినా నవ్వడం.. ఏడుపు రాకపోయినా ఏడవడం.. గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా గొడవలు పెట్టుకోవడం.. ఒకటా రెండా ఎన్ని చెప్పుకున్నా తక్కువే . మహానటి అవార్డు బిగ్బాస్ హౌస్లో ఎవరికైనా ఇవ్వచ్చు అంటే కచ్చితంగా అది శోభ శెట్టికే అంటూ జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు .

అలాంటి శోభాశెట్టి 14వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది కాగా శోభ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే బయటకు వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతకుమించిన బిగ్ బంపర్ ఆఫర్ కొట్టేసావు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. వశిష్ట మెగాస్టార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం శోభశెట్టిను ఫిక్స్ చేసుకున్నారట .

 

ఆమెలోని వైల్డ్ మాస్ విలనిజంను చూసిన వశిష్ట ఈ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అంటూ సెలెక్ట్ చేసుకున్నారట . ఇదే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. వెధవ బిగ్ బాస్ ట్రోఫీ పోతే పోయింది మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఎన్ని జన్మలెత్తినా రాదు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె హౌస్ నుండి వెళ్ళిపోవడమే బెటర్ అంటూ చెప్పుకుంటున్నారు..!!