సినిమా ఇండస్ట్రీ లోకి యంగ్ హీరోస్ ఎక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఎంతమంది సీనియర్ హీరోలు.. స్టార్ హీరో సినిమాలు చూస్తున్న సరే ఈ జనరేషన్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు . ఈ క్రమంలోనే టాలీవుడ్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోల లిస్ట్ పెరిగిపోతుంది . రీసెంట్గా టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల “బబుల్గం” అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .
సినిమా పాజిటివ్ రిజల్ట్ అందుకున్న సూపర్ హిట్ టాక్ మాత్రం అందుకోలేకపోయింది. దానికి కారణం ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడమే . మాట్లాడితే ముద్దులు.. కోప్పడితే హగ్గులు ఇంకా ఎక్కువైతే కొరకడాలు ..అవి తప్పిస్తే సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి మేటర్ ఏమీ లేదు . సుమలాంటి స్టార్ యాంకర్ ఇలాంటి వల్గర్ కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం అలాంటి పిచ్చి కంటెంట్ ద్వారా తన కొడుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడం అభిమానులకు కూడా నచ్చడం లేదు .
కామెంట్స్ నెగటివ్ గా వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం రోషన్ పర్లేదనిపించాడు . మొదటి రోజే కోటి రూపాయలు కలెక్ట్ చేసి బబుల్ గం సినిమా అందరి కళ్ళల్లో పడింది . దీంతో న్యూ ఇయర్ వీకెండ్ సందర్భంగా సినిమాను చూసే వాళ్ళ లిస్ట్ ఎక్కువైపోయే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలు . చూద్దాం ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో..??