మహేశ్ కి చెల్లి గా ఆ స్టార్ హీరోయిన్ ..? వావి వరసలు మార్చేశావు కదారా డైరెక్టరు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . అంతేకాదు ఈ సినిమా తర్వాత మహేష్ – రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అవుతున్నాడు. కాగా రీసెంట్గా మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .

రాజమౌళి తన సినిమాలో హీరోయిన్స్ ను చాలా పకడ్బందీగా చూస్ చేసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ను ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకుని తీసుకుంటున్నారట . అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబుకి చెల్లెలి క్యారెక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ ను చూస్ చేసుకున్నారట. దీంతో ఒక్కసారిగా అనుపమ పరమేశ్వరణ్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు .

రాజమౌళి లాంటి బడా డైరెక్టర్ దర్శకత్వంలో ఆఫర్ ఇచ్చినందుకు ఆనందపడాలో,, మహేష్ లాంటి స్టార్ హీరోకు సిస్టర్ రోల్ చేస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ లాంటి గ్లోబల్ బ్యూటీస్ కూడా యాక్ట్ చేయబోతున్నారట..!!