ఇంటికి పిలిపించి మరి నితిన్ దగ్గర్ “ఎక్స్ట్రాడనరీ మ్యాన్” సినిమాకు .. సైన్ చేయించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అంతేకాదు జనాలు కూడా ఆ విషయాన్ని లైట్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు . కాగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాను కూడా వక్కంతం వంశీ మెగా హీరో రామ్ చరణ్ కోసం రాసుకున్నారట . ఆయన బాడీ లాంగ్వాజ్ కు ఈ కామెడీ ఎంటర్టైనర్ బాగా వర్క్ అవుట్ అవుతుంది అనుకున్నారట.

అయితే రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చాక ఇలాంటి కామెడీ సినిమాలు తీస్తే జనాలు యాక్సెప్ట్ చేయరేమో అంటూ సందేహ పడ్డారట . అంతేకాదు ఈ సినిమాను నితిన్ తో తెరకెక్కిస్తే ఇంకా బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట. వక్కంత వంశీని తన ఇంట్లో కూర్చోపెట్టుకొని నితిన్ కి కాల్ చేసి రప్పించి.. స్టోరీ వినిపించి అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేయించాడట .

అంత క్లోజ్ ఫ్రెండ్ నితిన్ – రామ్ చరణ్ . కేవలం చరణ్ కి మాత్రమే కాదు మెగా హీరోలు అందరికి ఈయన చాలా క్లోజ్. ఇప్పుడు నితిన్ ఖాతాలో హిట్ పడింది అంటే దానికి కారణం కచ్చితంగా రాంచరణ్ అనే చెప్పాలి. చూడాలి మరి నితిన్ నుండి రాబోయే నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోటుందో..?