ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాలు లేవ్… నీకు నాకు కటీఫ్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకప్పటి విషయాలను తవ్వి లోడి బయటకు తీసి ట్రోల్ చేసి సరదా పడిపోతున్నారు . ఇది పైసాచిక ఆనందమో.. లేక మెంటల్ అని చెప్పాలో అర్థం కావడం లేదు . ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా ఉపాసనకు సంబంధించిన పాత విషయం ఒకటి మరోసారి ట్రెండ్ చేస్తున్నారు మెగా హేటర్స్ .

ఉపాసన – రాంచరణ్ పెళ్లి చేసుకున్నాక రామ్ చరణ్ ని లిప్ లాక్ సీన్స్ లో నటించొద్దు అంటూ క్రేజీ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. చరణ్ కూడా ఉపాసన ఇష్టం ని గౌరవిస్తూ వచ్చాడు . అయితే రంగస్థలం సినిమాలో సమంత రామ్ చరణ్ కి ముద్దు పెట్టేస్తుంది .ఈ విషయం రాంచరణ్ కి అస్సలు తెలియదు. తెరవనక డైరెక్టర్ సుకుమార్ అంతా ప్లాన్ చేసి నడిపించాడు . ఈ టైం లో ఉపాసన చాలా హర్ట్ అయిందట.

అందుకే ఎంతో ఇష్టంగా స్నేహంగా ఉన్న సమంత నెంబర్ ని బ్లాక్ చేసి ఇక ఆమెతో మాట్లాడకూడదు అని ఆమె తనను చీట్ చేసింది అని భావించిందట . కానీ తీరా అసలు మేటర్ తెలుసుకున్నాక ఇదంతా సుకుమార్ తప్పు అని చిరంజీవి క్లారిటీ ఇచ్చాక సమంతతో మళ్ళీ మాట్లాడడం ఉపాసన స్టార్ట్ చేసింది . ఆ టైంలో సమంత పై ఉపాసన చాలా గుర్రుగా ఉండిందట . కానీ ఫ్రెండ్షిప్ అంతకన్నా స్ట్రాంగ్ అందుకే వీళ్లిద్దరు మళ్ళీ మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. విడాకులు తీసుకున్న టైంలో కూడా సమంతకు ఉపాసన చాలా అండగా నిలిచింది..!!