పాపులర్ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట.. కార‌ణం ఇదే..

ప్రముఖ యూట్యూబర్‌ చందు సాయి పక్కింటి కుర్రాడుగా బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ‌ర్‌ వేదికపై ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి తనకంటూ మంచి పాపులారిటీ దక్కించుకున్న చందు సాయి ఒకటి రెండు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక ఇటీవల అతనిని నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చందు సాయి తనను లైంగికంగా వేధించాడంటూ అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎన్నో వెబ్ సిరీస్‌లో నటించిన చందు సాయికి మిలియన్స్‌లో వ్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మెప్పించిన చందు సాయి గత కొంతకాలంగా షార్ట్ ఫిలిమ్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

అయితే తాజాగా తనపై ఆరోపణలు చేయడంతో చందు సాయి పేరు నెట్టింట వైరల్‌గా మారింది. మెసేజ్ ఓరియెంటెడ్ కామెడీ వీడియోలు ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ ఈ కుర్రాడు నిజంగా అలాంటి పని చేసి ఉంటాడు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.