టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకొని ముందుకెళ్తున్నాడు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోని పాల్గొనబోతున్నాడు . ఆ తర్వాత మళ్లీ దేవర 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.
కాగా ఇలాంటి క్రమంలోనే తారక్ కొడుకుకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. NTRకి ఇద్దరు కొడుకులు అభయ్ రామ్ – భార్గవ్ రామ్ . పెద్దకొడుకు అభయ్ రామ్ చాలా సైలెంట్ తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అచ్చం లక్ష్మీ ప్రణతి లాగా. చిన్న కొడుకు భార్గవరామ్ మాత్రం చాలా చాలా అల్లరి . క్షణం కూడా ప్రశాంతంగా ఉంచడు .ఒకటే ఆటలు ఒకానొక ఇంటర్వ్యూలో నాని కూడా తారక్ చిన్నబ్బాయి కంచు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు .
అయితే జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు మొదటి నుంచి చాలా అల్లరి అల్లరిగా ఉంటాడట . మరీ ముఖ్యంగా ఆటల పిచ్చి . కొత్త గేమ్స్ ని ఆడాలని డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ని కూడా కనిపెడుతూ ఉంటాడట . గతంలో ఇదే విధంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఉన్నారట . చిన్నప్పుడు మోక్షజ్ఞ ఆటలతో చంపేసేవాడట. ఇంట్లోని గిన్నెల నుంచి మార్కెట్లో దొరికే రకరకాల టాయ్స్ వరకు అన్నిటితో ఆడుకున్నాడట. అదే క్వాలిటీ ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకుకి కూడా వచ్చింది అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటున్నారు . మోక్షజ్ఞ కూడా త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది..!!