హమ్మయ్య .. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులు విష్ ఫుల్ ఫిల్ అయ్యింది. బాహుబలి లాంటి హిట్ కొట్టాలి అనుకున్నా ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా అలాంటి ఓ హిట్ అందించింది . మరీ ముఖ్యంగా ప్రభాస్ సలార్ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో మనం చూసాం. అంతేకాదు ప్రభాస్ కెరియర్ ని మళ్ళీ లైన్ లో పెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. అయితే మొదటి పార్ట్ సిజ్ ఫైర్ అభిమానులని ఆకట్టుకున్న అసలు మ్యాటర్ అంతా పార్ట్ 2 లోనే ఉంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ప్రశాంత్ నీల్.
అంతేకాదు పార్ట్ 2 కు “శౌర్యంగా పర్వం” అంటూ పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు . అక్కడితో ఆగిపోయిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో చాలా చాలా సస్పెన్స్ లు ఉన్నాయని కచ్చితంగా పార్ట్ వన్ కి మించిన హిట్ అవుతుంది అంటూ భారీ హైప్స్ పెంచేశారు . అంతేకాదు నిజానికి సలార్ పార్ట్ వన్ సినిమా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే . అసలు కథ ఏంటి..? పాత్రలు పరిచయం మాత్రమే ఉంటుంది .
నిజమైన కథ ఏంటో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 చూడాల్సిందే. సలార్ మూవీ స్లో గా మొదలైనప్పటికీ ఫ్రీ ఇంటర్వెల్ నుంచి ఆడియన్స్ ని కనీసం సీట్లల్లో కూర్చొనీకుండా ఉండే సీన్స్ ఉన్నాయి . ఆ రేంజ్ లో ప్రభాస్ ఉగ్రరూపం పీ. క్స్ కి వెళ్ళింది క్లైమాక్స్ అయితే దిమ్మ తిరిగిపోయేలా చేసింది . పార్ట్ 2 టైటిల్ “శౌర్యంగా పర్వం” అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!